ట్రోఫీతో నా జర్నీని ముగించాలని చూస్తున్నా

ట్రోఫీతో నా జర్నీని ముగించాలని చూస్తున్నా

రంగియోరా (న్యూజిలాండ్‌‌‌‌): విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో లెజెండరీ ప్లేయర్‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌ ఎన్నో రికార్డులు సాధించింది. ఆమె కెరీర్‌‌‌‌లో ఒకే ఒక్క లోటు వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ మాత్రమే. 2000లో న్యూజిలాండ్‌‌‌‌లో తొలి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఆడిన ఆమె ఇప్పటిదాకా ఐదు వన్డే వరల్డ్‌‌‌‌కప్స్‌‌‌‌లో పోటీ పడ్డది.  కానీ, ఐసీసీ ట్రోఫీ నెగ్గాలన్న ఆమె కల మాత్రం నిజం కాలేదు.   రెండు దశాబ్దాల తర్వాత తన వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రయాణాన్ని మొదలుపెట్టిన న్యూజిలాండ్‌‌‌‌ గడ్డపైనే మరో వరల్డ్‌‌‌‌ పోరుకు రాజ్​ రెడీ అయింది. వయసు దృష్ట్యా కెరీర్‌‌‌‌లో చివరి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఆడబోతున్న 39 ఏళ్ల మిథాలీ ఐసీసీ కప్‌‌‌‌ నెగ్గాలన్న తన కల నిజం చేసుకొని కెరీర్‌‌‌‌ను పరిపూర్ణం చేసుకోవాలని చూస్తోంది.  శుక్రవారం మొదలయ్యే మెగా టోర్నీలో ఇండియాను ముందుండి నడిపించనున్న మిథాలీ.. తన తొలి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తాజా టోర్నీ గురించి  కూడా మాట్లాడింది. ‘2000 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ న్యూజిలాండ్‌‌‌‌లోనే ఆడాం. టైఫాయిడ్‌‌‌‌ కారణంగా ఆ టోర్నీలో నేను కొన్ని మ్యాచ్‌‌‌‌లు ఆడలేదు. ఇన్నాళ్ల తర్వాత మరో వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కోసం మళ్లీ ఇక్కడికొచ్చాం. మొదలు పెట్టిన చోటుకే తిరిగొచ్చా. నా ప్రయాణాన్ని ముగించాలని చూస్తున్నా.  నా టీమ్​మేట్స్​ బాగా ఆడాలని కోరుకుంటున్నా. తద్వారా ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ట్రోఫీని అందుకునే అవకాశం లభిస్తుందని  అనుకుంటున్నా’ అని ఐసీసీ పోస్టు చేసిన ఓ వీడియాలో మిథాలీ పేర్కొంది. 

పెద్ద స్కోర్లు చేస్తాం..

ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్​తో  టీ20తో పాటు ఐదు వన్డేల సిరీస్‌‌‌‌లో 1–4 తేడాతో ఓడినా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో మాత్రం బాగా ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మిథాలీ చెబుతోంది. ‘ఒక జట్టుగా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో మంచిగా ఆడాలని చూస్తున్నాం. కివీస్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెట్టాం. అంతకుముందు సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌‌‌ టూర్స్‌‌‌‌లోనూ దీనిపై ఆందోళన ఉండేది. కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లకు వచ్చే సరికి నిలకడగా 250 ప్లస్‌‌‌‌ స్కోరు చేయగలిగాం. దీన్ని వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లోనూ కొనసాగించడంతో పాటు ఇంకా పెద్ద స్కోర్లు చేస్తామని అనుకుంటున్నాం’అని హైదరాబాదీ రాజ్‌‌‌‌ తెలిపింది. 

ఇద్దరు లెఫ్టాండ్‌‌‌‌ బ్యాటర్లు ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌

టాప్‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌లో ఇద్దరు లెఫ్టాండ్‌‌‌‌ బ్యాటర్లు ఉండటంతో లెఫ్ట్​ రైట్​ కాంబినేషన్​ టీమ్‌‌‌‌కు ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌ అవుతుందని మిథాలీ అభిప్రాయపడింది. ఇక, ఈ మెగా టోర్నీకి ముందు మిథాలీ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉంది. కివీస్‌‌‌‌తో వన్డేల సిరీస్‌‌‌‌లో మూడు ఫిఫ్టీలు కొట్టింది. ఏడాది కాలంలో 9 హాఫ్‌‌‌‌ సెంచరీలు చేసింది. బేసిక్స్​కు కట్టుబడటమే తన నిలకడకు కారణం అని చెప్పింది. ‘పెద్ద గేమ్స్‌‌‌‌లో ఎక్కువ ఒత్తిడి సమయాల్లో నిలకడ కొనసాగించడం కష్టం. కాబట్టి నేనెప్పుడూ గేమ్‌‌‌‌ బేసిక్స్‌‌‌‌కు కట్టుబడి ఆడేందుకే ప్రయత్నిస్తా. ఎన్నో ఏళ్లుగా మనం నేర్చుకున్న బేసిక్స్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెట్టడం చాలా ముఖ్యం. కఠిన సమయాల్లో అవే మనకు హెల్ప్‌‌‌‌ చేస్తాయి’ అని మిథాలీ చెప్పుకొచ్చింది.

అబ్బాయిలూ స్ఫూర్తి పొందాలి

వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో బాగా ఆడితే ఇండియన్‌‌‌‌ విమెన్ క్రికెట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఫ్యాన్‌‌‌‌ బేస్‌‌‌‌ కచ్చితంగా పెరుగుతుందని మిథాలీ అభిప్రాయపడింది. ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి చేరుకున్న  విమెన్‌‌‌‌ క్రికెటర్లను చూసి అబ్బాయిలు కూడా స్ఫూర్తి పొందాలని చెప్పింది.    ‘టీమ్‌‌‌‌లోని ప్రతి ఒక్కరినీ ప్రజలంతా గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నా. ఇప్పటికే చాలా మంది యంగ్‌‌‌‌ గర్ల్స్‌‌‌‌.. మాప్లేయర్ల వైపు చూస్తున్నారు. మరికొందరు విమెన్‌‌‌‌ క్రికెటర్లను కూడా వాళ్లు ఆరాధిస్తారని అనుకుంటున్నా’ అని మిథాలీ రాజ్‌‌‌‌ చెప్పింది.

సెకండ్‌‌ ర్యాంక్‌‌లోనే మిథాలీ

ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌లో మిథాలీ రాజ్​ తన రెండో ప్లేస్​ను నిలబెట్టుకుంది. మంగళవారం రిలీజైన లిస్ట్​లో  మిథాలీ 735 రేటింగ్‌‌ పాయింట్లు సాధించింది. ఓపెనర్‌‌ మంధాన ఎనిమిదో ర్యాంక్‌‌లో ఉండగా..  హర్మన్‌‌ప్రీత్‌‌ 20 వ ర్యాంక్‌‌కు దూసుకొచ్చింది. బౌలర్లలో  దీప్తి శర్మ 13 నుంచి 12వ ర్యాంక్‌‌కు చేరగా.. వెటరన్‌‌ పేసర్‌‌ జులన్‌‌ గోస్వామి (4వ ర్యాంక్‌‌) మాత్రమే టాప్‌‌-10లో ఉంది.

వామప్‌‌‌‌లో విండీస్‌‌‌‌పై  గెలుపు

వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌నకు ముందు ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌ పెంచుకుంది. రెండు వామప్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో మిథాలీ రాజ్‌‌‌‌ కెప్టెన్సీలోని టీమ్‌‌‌‌ సత్తా చాటింది. మొన్న సౌతాఫ్రికాపై గెలిచిన జట్టు ఇప్పుడు వెస్టిండీస్‌‌‌‌ను చిత్తు చేసింది. మంగళవారం జరిగిన రెండో వామప్‌‌‌‌లో ఇండియా 81 రన్స్‌‌‌‌ తేడాతో విండీస్‌‌‌‌పై ఘన విజయం సాధించింది. ఓపెనర్‌‌‌‌ స్మృతి మంధాన (66), దీప్తి శర్మ (51) ఫిఫ్టీలు కొట్టడంతో తొలుత ఇండియా 50 ఓవర్లలో 258 రన్స్‌‌‌‌ చేసింది. సౌతాఫ్రికాతో వామప్‌‌‌‌లో చెవికి బాల్‌‌‌‌ తగిలి గాయపడ్డ మంధాన రెండు రోజుల్లో కోలుకొని తిరిగొచ్చింది. యస్తికా భాటియా (42), మిథాలీ (30) కూడా రాణించారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ 50 ఓవర్లలో 177/9 స్కోర్​ చేసి ఓడింది. ఇండియా బౌలర్లలో వస్త్రాకర్‌‌‌‌ (3/21), రాజేశ్వరి (2/39), దీప్తి శర్మ (2/31), మేఘనా (2/30)  రాణించారు. ఈ నెల 6న జరిగే మెయిన్‌‌‌‌ టోర్నీ తొలి మ్యాచ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌తో మిథాలీసేన తలపడనుంది.