భారత్ vs ఇంగ్లండ్: కెప్టెన్ గా మిథాలీ రాజ్

భారత్ vs ఇంగ్లండ్: కెప్టెన్ గా మిథాలీ రాజ్

స్వదేశంలో ఇంగ్లండ్ తో తలపడనుంది భారత మహిళా క్రికెట్ జట్టు. ఫిబ్రవరి 22న మొదలవనున్న వన్డే సిరీస్ కు మిథాలీ రాజ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ముంభైలోని వాంఖాడే స్టేడియం ఈ సిరీస్ కు వేదిక అవనుంది. ఐసీసీ ఉమెన్ చాంపియన్ షిప్ లో భాగంగా.. మూడు వన్డేల సిరీస్ లు ఆడనున్నాయి ఇరు జట్లు. ఫిబ్రవరి 22న మొదటి మ్యాచ్..25న రెండవ మ్యాచ్.. 28న మూడవ మ్యాచ్ జరుగనుంది.

మహిళా క్రికెట్ జట్టు: మిథాలీ రాజ్ (కేప్టెన్), ఝులన్ గోస్వామి, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తీ శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), ఆర్ కల్పన (వికెట్ కీపర్), మోనా మేశ్రమ్, ఏక్తా భిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, శిఖా పాండే, మాన్సీ జోషీ, పూనమ్ రౌత్.

స్మృతి మంధాన కేప్టెన్ గా.. బోర్డ్ ప్రెసిడెంట్ లెవెన్ మ్యాచ్
ఫిబ్రవరి 18వ తేదీన ఇంగ్లండ్ జట్టుతో ఆడబోయే బోర్డ్ ప్రెసిడెంట్ లెవెన్ టీమ్ ను కూడా ప్రకటించారు. బోర్డు ప్రెసిడెంట్ లెవెన్ టీమ్ కు స్మృతి మంధాన కేప్టెన్.
బోర్డు ప్రెసిడెంట్ లెవెన్ టీమ్: స్మృతి మంధాన (కేప్టెన్), వేదా కృష్ణమూర్తి, దేవికా వైద్య, ఎస్ మేఘన, భారతి ఫుల్మలి, కోమల్ జన్ జడ్, ఆర్ కల్పన, ప్రియా పునియా, హర్లీన్ డియోల్, రీమాలక్ష్మి ఎక్కా, మనాలి దక్షిణి, మిన్నూ మణి, తనూజా కన్వర్.