జైపూర్‌లో ఆరు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు

జైపూర్‌లో ఆరు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు

రాజస్థాన్ రాష్ట్రంలోని ఎయిర్ పోర్ట్, హాస్పిటల్స్ పై బాంబు అటాక్ చేస్తామని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులను నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే సోమవారం కూడా జైపూర్ లో ఆరు స్కూల్స్ లో బాంబులు పెట్టామని స్కూల్ మేనేజ్ మెంట్ కు మెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు బాంబ్ స్వౌడ్ తో వచ్చి అరగంటపాటు తనిఖీలు జరిపారు. పిల్లల్ని, సిబ్బందిని స్కూల్ నుంచి బయటకు పంపారు. పోలీసు బృందాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, స్నిఫర్ డాగ్‌లు ఎంత వెతికినా అనుమానస్పద వస్తువులు ఏం కనిపించలేదు.