బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత

బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత

హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓల్డ్ మలక్ పేటలో బతికుండగానే చనిపోయినట్లు హిందువుల ఓట్లు తీసేశారని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధావిలత ఆరోపించారు. మలక్ పేట పరిధిలోని 119బూత్ లోని ఎన్.మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బతికి ఉండగా 13a లో వేసి చనిపోయినట్లు ఓటు తీసేయడం దుర్మార్గపు చర్యని ఆమె అన్నారు. దీంతో పోలింగ్ సెంటర్ కు వచ్చిన వారు ఓటు లేదనడంతో పోలీసులు వారిని బయటకు పంపుతున్నారని అన్నారు ఆమె. GHMC, ఎలక్షన్ అధికారుల కలిసి ఇలానే చాలా ఓట్లును తొలగించారని మాదవిలత ఆరోపించారు.