సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ స్టేట్మెంట్ రికార్డ్.. సర్వేలు చేసుకునే ఆరా మస్తాన్కు.. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఏంటంటే..

సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ స్టేట్మెంట్ రికార్డ్.. సర్వేలు చేసుకునే ఆరా మస్తాన్కు.. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఏంటంటే..

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ విచారణ ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు ఆరా మస్తాన్ విచారణ జరిగింది. రెండవసారి ఆరా మస్తాన్ స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే తనను పిలిచారని విచారణ అనంతరం మస్తాన్ చెప్పారు. మళ్లీ వారం రోజుల తర్వాత తనను పిలిచే అవకాశాలున్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక రెండు నెలల్లో కొలిక్కి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 2020 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అనుమానం ఉందని, తనతో పాటు మరికొందరిని సిట్ పిలుస్తుందనుకుంటున్నానని మస్తాన్ చెప్పుకొచ్చారు. సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ సిట్ ముందు ఇదే కేసులో రెండోసారి హాజరు కావడం గమనార్హం.

ALSO READ : బుసలు కొడుతున్న నాగు పాము చెరలో కుక్క పిల్లలు..

ఫోన్ ట్యాపింగ్ వెనుక దాగున్న రాజకీయ కుట్రలపై సిట్ వివరాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో.. ఆరా మస్తాన్ మాట్లాడిన కాల్స్ ట్యాప్ చేసినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో.. మస్తాన్ సంభాషణలు ట్యాపింగ్ అయినట్టు గుర్తించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, హరీష్ రావు, ఈటల, కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన విషయం విదితమే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని..  ప్రభాకర్ రావు టీం ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో సాక్షిగా ఆరా మస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చారు.