బీఆర్ఎస్ పార్టీ టైర్ పంక్చర్ అయ్యిందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందుకే కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. గజ్వేల్ లో తొంబైకి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారని అన్నారు. దీంతో కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందని ఎద్దేవా చేశారు. ఓటమిని భరించలేక తోలు తీస్తా అని కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలకు దిగుతున్నారని అన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్ :
* కేసీఆర్ తనను గెలిపించిన గజ్వెల్ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు కానీ తోలు తీస్తాడంట
* గతానికంటే ఎక్కువగా దుబ్బాక లో 56 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది
* సిద్దిపేటలో సర్పంచ్ క్యాండిడేట్ దొరకడమే కష్టంగా ఉండేది.. కానీ ఇప్పుడు ప్రతి స్థానంలో అభ్యర్థిని పెట్టాం కొన్ని గెలిచాం
* కార్యకర్తల కష్టం వల్లే ఇన్ని స్థానాలు గెలుపొందాం
* ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలపై ప్రజలలో మంచి స్పందన ఉంది
* పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకోండి
* అప్పుడే నాయకుడికి ప్రజలకు మధ్య బాండింగ్ ఏర్పడుతుంది
* ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎక్కువ నిధులు , ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వమని ముఖ్యమంత్రి కోరాను
* జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు బలం లేదు అన్నారు.. ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాం
* గెలిచిన సర్పంచులందరినీ ముఖ్యమంత్రితో కలిపిస్తా
* మీ శ్రమ గొప్పది.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ సర్పంచ్ ఎన్నికల్లో చూపించారు
