కామారెడ్డి టౌన్లో రాత్రుళ్లు చేతిలో.. ఇనుప రాడ్లతో దొంగలు హల్చల్.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు !

కామారెడ్డి టౌన్లో రాత్రుళ్లు చేతిలో.. ఇనుప రాడ్లతో దొంగలు హల్చల్.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు !

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పలు కాలనీల్లో రాత్రి సమయంలో ఇనుప రాడ్లు చేతబట్టుకుని దొంగలు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పట్టణ వాసులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓల్డ్ ఎస్పిఆర్, ఆర్కే నగర్ కాలనీల్లో రాత్రి పూట రాడ్లతో సంచరిస్తున్న దొంగల విజువల్స్ సీసీ కెమెరార్లో రికార్డ్ కావడం గమనార్హం. ఇటీవల పలు కాలనీలో దొంగతనాలు జరగడంతో పలు కాలనీల వాసులు భయాందోళనలో ఉన్నారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైంది. ఆయా చోట్ల గడ్డపారతో ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి నుంచి బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 2న తాడ్వాయి మండలం చిట్యాలలో మసులా శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ చేయగా గడ్డ పార దొంగల ముఠా పట్టుబడిందని ఎస్పీ రాజేశ్​చంద్ర మీడియాకు చెప్పారు. దొంగలు ప్రయాణించిన మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు.

►ALSO READ | చేపల కోసం వల వేస్తే కొండ చిలువ పడింది.. ఎంత పెద్దగా ఉందో చూడండి !

దొంగలు ఉపయోగించిన టూ వీలర్​ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కొంత సమాచారం లభించిందన్నారు. ఈ ముఠా సభ్యులపై నిఘా పెట్టి ఉంచామన్నారు.  తాడ్వాయిలో ఎస్సై ఆధ్వర్యంలో  వెహికల్స్​ తనిఖీ చేస్తుండగా ఈ గ్యాంగ్​ పట్టుబడినట్లు తెలిపారు. వీరు గత కొంత కాలంగా  తాడ్వాయి, గాంధారి, లింగంపేట, రాజంపేట, బాన్సువాడ మండలాల్లో  చోరీలకు పాల్పడుతున్నారన్నారు. తాళాలు వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని రాత్రి వేళల్లో గడ్డ పారతో తాళాలు పగుల గొట్టి చోరీలు చేస్తున్నారన్నారు.