పవన్ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు : ఎమ్మెల్యే దానం నాగేందర్

పవన్ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు  : ఎమ్మెల్యే దానం నాగేందర్

ఏపీ డిప్యూటీ సీఎం తన ఫోకస్ ఆంద్రప్రదేశ్ పై  పెడితే బాగుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హితవు పలికారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్నామని , ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సభల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టొదని కోరారు. దీనిని అదునుగా తీసుకొని కొంతమంది ప్రాంతీయ విబేధాలు సృష్టించాలని చూస్తున్నారని , పవన్ కళ్యాణ్ దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు. 

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ముందుకు సాగాలని దానం ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాయత్ నగర్ లో జరిగిన వేడుకల్లో దానం పాల్గొని  జాతీయ జెండాను ఆవిష్కరించారు.  జాతీయ గీతాన్ని , తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని దానం నాగేందర్ అన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని దానం స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తుందన్నారు.

ప్రెస్ మీట్ కు పర్మిషన్ ఇస్తారా.?

తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారా? అని తన ఎక్స్ లో పోస్ట్ చేశారు పవన్