బండి భగీరథ్ కేసులో రాజకీయం వద్దు: ఎమ్మెల్యే దానం నాగేందర్

బండి భగీరథ్ కేసులో రాజకీయం వద్దు: ఎమ్మెల్యే దానం నాగేందర్

సైఫాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి కక్షపూరిత చర్యలు ఉండవని, ప్రతిపక్షాలు దీనిని మానవతా దృక్పథంతో చూడాలే తప్ప రాజకీయం చేయకూడదని హితవు పలికారు. 

కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున నిశితంగా గమనించాలని సూచించారు. శుక్రవారం ఆదర్శ్​నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.