అమ్రాబాద్, వెలుగు : రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం అమ్రాబాద్ మండల కేంద్రంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వానికి భిన్నంగా సన్న వడ్ల సాగుకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నామని, పంట అమ్మిన వెంటనే నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు నెలల్లోనే రూ. 21 వేల కోట్లతో 25 లక్షల మందికి రుణమాఫీ పూర్తి చేశామని, రైతు భరోసా ద్వారా రూ. 12 వేలు అందిస్తున్నామని వివరించారు. గోడౌన్ల సామర్థ్యాన్ని 200 శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపడతామని తెలిపారు.
