- మంత్రిగా మొదటిసారి నాయిని ఇంటికొచ్చిన కొండా సురేఖ
- హాజరైన ఎమ్మెల్యేలు కడియం, నాగరాజు, రేవూరి, గండ్ర, ఎమ్మెల్సీ సారయ్య
వరంగల్, వెలుగు : ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఉప్పునిప్పుగా ఉండే సీనియర్ నేతలు సోమవారం సాయంత్రం ఆత్మీయంగా ఓ చోట చేరి మంచీచెడు మాట్లాడుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తన క్యాంప్ ఆఫీసులో నేతలందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ మొదటిసారి నాయిని నివాసానికి వచ్చారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ అధ్యక్షుడు అయూబ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మాజీ మేయర్ గుండు సుధారాణి తదితరులు ఈ డిన్నర్‌కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలంతా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కలిసి భోజనం చేశారు. పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, ఉమ్మడి ఓరుగల్లు రాజకీయాల్లో మొదటిసారి నిర్వహించిన ఈ ఆత్మీయ విందు అందరిలో ఆసక్తి లేపింది.
