సిటీలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు

సిటీలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వెనక కేంద్ర నేతలు ఉన్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే సీపీఐ 3వ రాష్ట్ర మహా సభల పోస్టర్ ను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి ఇక్కడ రాజకీయ పావు తప్ప మరొకటి కాదని విమర్శించారు. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు..ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.