అంగన్ వాడీ వ్యవస్థ  బలోపేతానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అంగన్ వాడీ వ్యవస్థ  బలోపేతానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: అంగన్ వాడీ వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొనయమాకుల రైతు వేదికలో శుక్రవారం గీసుగొండ, సంగెం మండలాల అంగన్ వాడీ టీచర్లకు మొబైల్స్​ను కలెక్టర్​సత్యశారదతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.