ఆక్సీజ‌న్ ప్లాంట్ పెట్టాల‌న్న‌ ఆలోచ‌న స‌ర్కార్ కు ఉందా..?

ఆక్సీజ‌న్ ప్లాంట్ పెట్టాల‌న్న‌ ఆలోచ‌న స‌ర్కార్ కు ఉందా..?

హైద‌రాబాద్: క‌రోనా మొద‌లై ఏడాది పూర్తైనా క‌నీసం ఒక ఆక్సీజ‌న్ ప్లాంట్ పెట్టాల‌న్న ఆలోచ‌న కేసీఆర్ సర్కార్ కు వ‌చ్చిందా అని ప్ర‌శ్నించింది ఎమ్మెల్యే సీతక్క.నేను చాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రికి  ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో సిటీ స్కాన్ సౌక‌ర్యాలుయున్నాయ‌న్నారు. ప్రైవేట్ హాస్పిటల్  వద్దు.. ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు అన్న ముఖ్యమంత్రి కరోనా వస్తే.. మీరు ఎక్కడికి పోయారు.. మీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు.. మీ మంత్రులు ఎక్కడ పోయారు ..ప్రైవేట్ హాస్పిటల్ కే కదా అన్నారు. ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని ప్ర‌శ్నించారు. అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, ఉచిత వైద్యం మన హక్కు.. అది సాధించుకుందాం అని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే సీత‌క్క‌.