V6 News

 కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె.. జేపీఎస్లకు ఎమ్మెల్యే సీతక్క మద్దతు

 కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె.. జేపీఎస్లకు ఎమ్మెల్యే సీతక్క మద్దతు

నాలుగేండ్లు గడిచినందున తమను రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్​), ఔట్ సోర్సింగ్​ పంచాయతీ సెక్రటరీ (ఓపీఎస్​)లు ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల దీక్షలు కొన్నసాగుతున్నాయి. ఇందులో భాగంగా ములుగు జిల్లాలో జేపీఎస్ లు దీక్షలు చేపట్టి నిరసన తెలుపుతున్నారు. తమను రెగ్యులర్‌ చేసే వరకు విధులను బహిష్కరించి..ఆందోళనలు కొనసాగిస్తామని జేపీఎస్లు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ తన హామీని నిలుపుకోవాలన్నారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. ఉద్యోగ కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా పర్మినెంట్ ఉద్యోగులుగా చేయకపోవడం బాధాకరమన్నారు ఎమ్మెల్యే సీతక్క. జూనియర్ కార్యదర్శుల డిమాండ్లను వెంటనే పరిష్కారించాలని వెల్లడించారామె. మరోవైపు విధుల్లో చేరకుంటే టర్మినేట్​ చేస్తామని జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అయినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు జేపీఎస్ లు.