ఏపీ ఉద్యోగాల్లో మనోళ్లకు చాన్స్ ఇప్పియ్యాలె..సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

ఏపీ ఉద్యోగాల్లో మనోళ్లకు చాన్స్ ఇప్పియ్యాలె..సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: ఏపీలో సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు అవకాశం ఇప్పించాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి సీఎం కేసీఆర్​ను కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు, తెలంగాణ, ఏపీ సీఎస్​లకు గురువారం లేఖ రాశారు. రూల్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల వారికి 20 శాతం అన్​రిజర్వుడ్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. కానీ, ఏపీ సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీలో ఆ రూల్స్‌‌ను పాటించడం లేదన్నారు. సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ తెలంగాణకు చెందిన వారనే కారణంగానే కొందరికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ సబ్సిడీలు పొంది ఏర్పాటు చేసిన పరిశ్రమలు, సాఫ్ట్​వేర్​ కంపెనీలు, మెట్రో రైలు ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర యువతకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన తెలంగాణ యువతకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ అందించే విధంగా ఏపీ సీఎం జగన్​తో చర్చించి న్యాయం చేయాలని సీఎం కేసీఆర్​ను ఆయన కోరారు.