హైదరాబాద్, వెలుగు: ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న ఆయన.. నందిని సిధారెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ... నందిని సిధారెడ్డి రచనలు, కవిత్వంలో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ స్పష్టంగా ప్రతిబింబిస్తాయని చెప్పారు. ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, యావత్ తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొంటూ సిధారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
