టీచర్ల ఈ-కుబేర పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

టీచర్ల ఈ-కుబేర పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  •     గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్లు, విద్యారంగ సమస్యలను పరిష్కరించి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు విజ్ఞప్తి చేశారు. శనివారం లోక్ భవన్‌‌‌‌‌‌‌‌లో గవర్నర్‌‌‌‌‌‌‌‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, వినతిపత్రాన్ని అందజేశారు. 

ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో కొత్త పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 6 డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ-కుబేర  పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నెలల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న టీచర్ల బిల్లులను క్లియర్ చేసి, వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలన్నారు. డీఎస్సీ–2003 టీచర్లతో పాటు సీపీఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.