హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లాలో మోసపూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు జగదీశ్ రెడ్డికి లేదన్నారు.
సూర్యాపేటలో త్రిముఖ పోటీలో 2 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ రెడ్డి మరోసారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘కేసీఆర్ బ్రీడ్ ఏంటో జగదీశ్ రెడ్డి చెప్పాలి. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బ్రీడ్ ఏంటో కూడా చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
