ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల లిస్టులో ముఖేష్ అంబానీ టాప్

ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల లిస్టులో ముఖేష్ అంబానీ టాప్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల గురించి సమాచారం అందించే మ్యాగజైన్ ఫోర్బ్స్.. భారత్ కు చెందినా 2021 ఇయర్ ధనవంతుల లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర విలువ 9270 మిలియన్ డాలర్లు, అంటే రూ. 6.96 లక్షల కోట్లు. అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తులు $ 7480 మిలియన్లు అంటే రూ .5.61 లక్షల కోట్లు.

భారతదేశం కుటుంబం, స్టాక్ మార్కెట్, విశ్లేషకులు, నియంత్రణ సంస్థల నుండి పొందిన వాటా..ఆర్థిక సమాచారం ఆధారంగా ఈ లిస్టును తయారు చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది.