
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమె మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాధన గుప్తా మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ట్విట్టర్‌లో తన సంతాపాన్ని ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. సాధన గుప్తా ములాయం సింగ్ యాదవ్ కు రెండవ భార్య. ఆమె కొడుకు పేరు ప్రతీక్ యాదవ్ కాగా బీజేపీ నాయకురాలైన అపర్ణా యాదవ్ ఆమెకు కోడలు అవుతుంది.
पूर्व मुख्यमंत्री श्री मुलायम सिंह यादव जी की पत्नी श्रीमती साधना गुप्ता जी के निधन का दुखद समाचार मिला,प्रभू पुण्यात्मा को अपने श्री चरणों में जगह दे. आदरणीय श्री मुलायम सिंह जी और परिजनों को ये दुख सहन करने की क्षमता दे!
— Keshav Prasad Maurya (@kpmaurya1) July 9, 2022
ॐ शांति शांति शांति