ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో భారత అథ్లెట్స్ జోరు

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో భారత అథ్లెట్స్ జోరు

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2022లో ఇండియన్ అథ్లెట్స్ అదరగొట్టారు.  మెన్స్ లాంగ్ జంప్ క్వాలిఫికేషన్స్ రౌండ్లో మురళీ శ్రీశంకర్ 8 మీటర్లు జంప్ చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో  శ్రీశంకర్ ఫైనల్ కు అర్హత పొందాడు. ఇక అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌‌ చరిత్రలో లాంగ్ జంప్ ఈవెంట్‌లో ఇండియన్ అథ్లెట్ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మురళీ శ్రీశంకర్ మే నెలలోనే 8.36 మీటర్లు జంప్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అయితే అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ క్వాలిఫికేషన్స్‌లో మాత్రం మురళీ 8 మీటర్లు  జంప్ చేయగలిగాడు. అతనితో పాటు క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో  జెస్విన్ ఆల్డ్రిన్ 7.79 మీటర్లు.. మహ్మద్ అనీస్ యాహియా 7.73 మీటర్లు దూకారు. 

అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ మెన్స్ 3000  మీటర్ల స్టీఫుల్‌ఛేజ్ హీట్స్‌లో భారత ఆర్మీకి చెందిన అవినాష్ సాబ్లే ఫైనల్కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్స్ రౌండ్లో 8 నిమిషాల 18.75 సెకన్లలో 3వేలమీటర్లను పూర్తి చేశాడు. దీంతో మూడో స్థానంలో నిలిచిన అతను ఫైనల్కు క్వాలిఫై అయ్యాడు.