సినిమాలో ఫైటింగ్ సీన్లను తలపించిన దృశ్యాలు.. అండర్ ట్రయల్ ఖైదీ, పోలీస్ మధ్య ఘర్షణ.. కత్తి, తుపాకీతో దాడులు..షాకింగ్ వీడియో వైరల్..
సేమ్ టు సేమ్.. హాలివుడ్ సినిమాలో యాక్షన్ సీన్.. ఖైదీ, పోలీస్ మధ్య ఘర్షణ.. ఒల్లు గగుర్పొడిచే భయంకరమైన ఫైటింగ్ సీన్.. ఒకరి చేతిలో కత్తి, మరొకరి చేతిలో పిస్టల్.. దాదాపు రెండు నిమిషాల భీకర పోరాటం.. ఇద్దరికీ తీవ్రగాయాలు..చివరికి ఆ పోరాటంలో ఖైదీ మృతిచెందగా, పోలిస్ కొనఊపరితితో పోరాడుతున్నాడు.పంజాబ్ లోని హెషియాపూర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో శనివారం(మే16) జరిగిన భయంకరమైన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఓ విచారణ ఖైదీ.. కానిస్టుబుల్ పై దాడి చేసింది కస్టడీనుంచి పారియేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో విచారణ ఖైదీ నసీబ్ సింగ్, కానిస్టేబుల్ జస్ దీప్ సింగ్ ఓ వీధిసందులో కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. తాడుతో కట్టేసి ఉంగా ఇద్దరు నడిరోడ్డుపై పెనుగులాడుతూ, రోడ్డుపై పడుతూ లేస్తూ కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పెనుగులాట సమయంలో, నసీబ్ సింగ్ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌ను లాక్కునేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.ఈ ఇద్దరూ నేలపై పడిపోవడం సీసీటీవీ దృశ్యాలలో కనిపిస్తోంది.
पंजाब पुलिस ने किया लाइव एनकाउंटर...
— News Leader (@NewsLeaderLive) May 17, 2026
पंजाब के होशियारपुर में एक बेहद सनसनीखेज घटना सामने आई, जहां मेडिकल जांच के लिए लाए गए एक कैदी ने पुलिस कर्मचारी पर तेजधार हथियार से हमला कर दिया. जवाबी कार्रवाई में पुलिसकर्मी ने गोली चलाई, जिससे कैदी की मौत हो गई. पूरी घटना CCTV कैमरे में… pic.twitter.com/BKpkzcZWUl
పోలీసుల కథనం ప్రకారం..ఖైదీలను తరలిస్తున్న ఈ-రిక్షాలో తొలుత ఘర్షణ చెలరేగి, ఆ తర్వాత అది వీధిలోకి పాకింది. కోర్టులో హాజరుపరిచే ముందు సాధారణ వైద్య పరీక్షల కోసం హోషియార్‌పూర్‌లోని సెంట్రల్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలను నలుగురు పోలీసు సిబ్బంది సివిల్ ఆసుపత్రికి తరలిస్తుండగా శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని గుజరాత్ పోలీసులు తెలిపారు.
ఖైదీలలో ఒకడైన నసీబ్ సింగ్ హత్య, హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.నసీబ్ సింగ్ బుల్లెట్ గాయంతో మృతిచెందగా.. కానిస్టేబుల్ జస్‌దీప్ సింగ్ ముఖం, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతనికి చికిత్స జరుగుతోందని, ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. ఖైదీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రి మార్చురికి తరలించారు.
