హైదరాబాద్, వెలుగు: మ్యూజియాలు పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు కావని, మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రపంచ వారసత్వ సంపదను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా సోమవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని మ్యూజియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలగాణంలో లభించిన ‘పరమార జగద్దేవుడి శాసనాలు’, ‘స్టకో స్కల్ప్చర్స్ ఇన్ సెంటెనరీ మ్యూజియం’ అనే పరిశోధనాత్మక పుస్తకాలతో పాటు ప్రత్యేక బ్రోచర్లను మంత్రి ఆవిష్కరించారు.
