ఆళ్వార్‌పేట్ నుండి అంధేరి వరకు.. జవాన్ సక్సెస్ పై అనిరుధ్ ఎమోషనల్ పోస్ట్

ఆళ్వార్‌పేట్ నుండి అంధేరి వరకు.. జవాన్ సక్సెస్ పై అనిరుధ్ ఎమోషనల్ పోస్ట్

జవాన్(Jawan) సినిమాతో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan) మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా రెస్పాన్స్ కు థియేటర్‌లు దద్దరిల్లిపోతుంటాయి. షారుఖ్ ఫ్యాన్స్ ఈలలు, గోలలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) తెర‌కెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా షారుఖ్ ఖాన్ ను పఠాన్ తరువాత మరో సూపర్ హిట్ పడింది.   

ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు జవాన్ విజయంలో అనిరుధ్ ప్రధాన పాత్ర పోషించాడు. తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు అనిరుధ్. ఇక సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఎమోషనల్ ట్వీట్ చేశాడు అనిరుధ్.. నా ప్రయాణం ‘ఆళ్వార్‌పేట్ నుంచి మొదలై అంధేరి వరకు చేరుకుంది.. జవాన్ మూవీను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు నా కృతజ్ఞతలు ఎప్పటికీ..  అంటూ రాసుకొచ్చాడు అనిరుధ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.