బక్రీద్ పై కరోనా ఎఫెక్ట్..ఈ సారి ఖుర్బానీ డౌటే!

బక్రీద్ పై కరోనా ఎఫెక్ట్..ఈ సారి ఖుర్బానీ డౌటే!
  •  సిటీలో తగ్గిన పొటేళ్ల అమ్మకాలు
  • హడావిడి వద్దని మతపెద్దల పిలుపు
హైదరాబాద్, వెలుగు : బక్రీద్ పండుగ వచ్చిందంటే సిటీలో పొట్టేళ్ల వ్యా పారం కోట్లల్లో నడుస్తుంది. ఇతర రాష్ట్రాల నుం చి తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఈసారి మాత్రంకరోనా కారణంగా బిజినెస్ డల్ అయింది. పండుగకు రెం డ్రోజులే ఉండగా, మేకలు మండీల్లో వెలవెలబోతున్నాయి. ఓవైపు హడావిడి లేకుండా బక్రీద్ జరుపుకోవాలని మత పెద్దలు పిలుపునివ్వగా, మరోవైపు ఖుర్బానీ ఇచ్చే వాళ్లుకూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదని వ్యాపారులు చెప్తున్నారు.
తగ్గిన అమ్మకాలు
జియాగూడ, బోయిగూడ, బహదూర్ పురా, అంబర్ పేట్ గోల్నాక, చార్మినార్, చెంగిచెర్ల , నాంపల్లి, కొత్తపేట మండీలతోపాటు శివారు ప్రాంతాలు, బస్తీల్లో బిజినెస్ బాగా నడుస్తుంది. బక్రీద్కు నెల ముందు నుంచే బీదర్, విదర్భ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మేకలు, గొర్రెలను భారీగా తీసుకొస్తుంటారు. సిటీవ్యాప్తంగా 6 లక్షల కు పైగా పొట్టేళ్లుఅమ్ముడవుతాయని జియాగూడ మండీ నిర్వాహకులు తెలిపారు. జియాగూడలో 40మందికిపైగా బిజినెస్ చేస్తుంటారు. బక్రీద్ కు వారం ముందే ఒక్కో వ్యాపారి కనీసం 200 పొట్టేళ్లుఅమ్ముతారు. ఈసారి 15రోజుల్లో30 కూడా అమ్మలేదని వాపోయారు.
ఖస్సీ మేకలు స్పెషల్
బక్రీద్కు గొర్రె పొట్టేళ్లు, మేకపోతుల కంటే ఖస్సీ మేకలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో ఖస్సీ మేక లేదా గొర్రె బరువును బట్టిరూ.25వేల నుంచి 50వేల వరకు ఉంటుంది. 3–4 ఖస్సీలను అమ్మినాలక్ష వరకు అదనంగా ఆదాయంవస్తుందని అంబర్పేట్కు చెందిన వ్యాపారులు తెలిపారు. వాటిని బీదర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి అమ్ముతామని వ్యాపారి రవీందర్ చెప్పారు.
 కరోనాతో భయం
ఒక్కో ముస్లీం  ఫ్యామిలీ కనీసం 3 కుటుంబాలకు ఖుర్బానీ పంచే సంప్రదాయం ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లాంటే నే భయపడుతున్నారు. తప్పనిసరిగా ఖుర్బానీ ఇవ్వాలనుకునే వారు మాత్రమే పొట్టేళ్లకొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి 30శాతం మంది ఖుర్బానీ పంపడం కష్టమేనని చార్మినార్కు చెందిన మహ్మద్ గౌస్ తెలిపారు. మరోవైపు చార్మినార్, జియాగూడ, బహదూర్ పురా, అంబర్ పేట ప్రాంతాల్లో నమోదైన కరోనా కేసులతో ఖుర్బానీఇచ్చినా.. తీసుకుంటారా అనే డౌట్కూడా స్థానికులు వ్యక్తంచేస్తున్నారు.
ఖుర్బానీకి బదులుగా…
ఈసారి బక్రీద్ను సాదాసీదాగా జరుపుకోవాలని మత పెద్దలు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ప్రార్థనలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఖుర్బానీకి బదులుగా పేదలకు ఆర్థిక సాయం చేయాలని చెప్తున్నారు. ఇక ఓల్డ్సిటీలో మటన్ వ్యాపారులకు ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహించగా, కేసుల తీవ్రతను బట్టి  ఆయా ప్రాంతాల్లోని క్రయవిక్రయాలపై ప్రభావం ఉండనుంది.