అక్టోబర్ 14న రిలీజ్ అవుతన్న ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’

 అక్టోబర్ 14న రిలీజ్ అవుతన్న  ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’

‘హుషారు’ ఫేమ్ తేజ్ కూర‌‌‌‌పాటి, అఖిలా ఆకర్షణ జంటగా వెంకట్ వందెల రూపొందించిన చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. కమలాక్షి, జీవీఆర్ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిన్న ఫిల్మ్ చాంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రెస్‌‌‌‌ మీట్ నిర్వహించారు. టైటిల్ సాంగ్‌‌‌‌ను, ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘చిన్న సినిమాల రిలీజ్‌‌‌‌కి ఎలాంటి హెల్ప్ చేయాలన్నా  ఫిల్మ్ చాంబర్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ చేస్తుంది.

అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత కాకుండా మొదలు పెట్టేటప్పుడే చాంబర్‌‌‌‌కి వచ్చి మొత్తం ప్లాన్, రిలీజ్ డేట్స్ చెబితే మేమే థియేటర్స్ ఇప్పిస్తాం. ఈ నెల 14 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని అన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రిలీజవుతున్న తమ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు హీరో హీరోయిన్లు. ‘మంచి ఉద్దేశంతో తీసిన ఈ సినిమాకి సరైన థియేటర్స్ దొరకనందున పోస్ట్‌‌‌‌పోన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మేమనుకున్న థియేటర్స్ దొరకడంతో గ్రాండ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు దర్శక నిర్మాతలు.  టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.