బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. హన్మకొండ బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు నడ్డా తెలంగాణకు వచ్చారు. నడ్డాను కలవాలంటూ భారత మహిళా మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ కు బీజేపీ నేతలు ఇన్విటేషన్ పంపారు. దీంతో శంషాబాద్ లోనే జేపీ నడ్డాతో మిథాలీరాజ్ భేటీ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత 3 గంటల 45 నిమిషాలకు హన్మకొండ బాలసముద్రంలో.. తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి జేపీ నడ్డా వెళ్లనున్నారు. నడ్డాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉండనున్నారు. సభ తర్వాత నోవాటెల్ హోటల్ కు నడ్డా చేరుకుంటారు. అక్కడ సినీ హీరో నితిన్.. జేపీ నడ్డాను కలవనున్నారు.
Former cricketer Mithali Raj meets BJP national president JP Nadda in Hyderabad, Telangana. pic.twitter.com/WuvbdA4L9y
— ANI (@ANI) August 27, 2022
జేపీ నడ్డా మినిట్ టు మినిట్ షెడ్యూల్...
- శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.40గంలకు హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకుంటారు.
- 3 నుంచి 3.15గంలకు వరంగల్ భద్రకాళీ అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
- 4.10నుంచి 5.40 వరకు పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటారు.
- 5.55కు వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగుప్రయాణం.
- నోవాటెల్ హోటల్ ల్లో నడ్డాను కలువనున్న హీరో నితిన్.
- రాత్రి 7 గంలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.

