కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రుమాదం జరిగింది. బొలెరోను ట్యాంకర్ ఢీ కొట్టడంతో స్పాట్ లోనే 8 మంది చనిపోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2026 ఏప్రిల్ 16న తెల్లవారుజామున మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
మృతుల్లో నలుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, డ్రైవర్ ఉన్నారు. మృతులు కర్ణాటక చిక్ బాలాపూర్ జిల్లా తరికిరీ తాలుక ఉదయ్ గ్రామస్తులుగా గుర్తించారు. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వేగంగా వచ్చిన వాహనాలు ఎదురెదురుగా ఢీకొనటంతో బొలెరో నుజ్జునుజ్జు అయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

