కాంగ్రెస్కు నాగం రాజీనామా.. జనార్థన్ ఇంటికి మంత్రులు

కాంగ్రెస్కు నాగం రాజీనామా.. జనార్థన్ ఇంటికి మంత్రులు

నాగర్‌కర్నూల్‌ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్థన్​ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్ లోని నాగం నివాసానికి నాగర్ కర్నూల్ ఎమ్యెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. నాగం జనార్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు.

నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నాగం.. కొద్దిరోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. రెండు రోజులుగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన అనుచరులతో చర్చల అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడారు.