బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. టికెట్ రానీ అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.మహబూబ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత  ఎర్ర శేఖర్  బీఆర్ఎస్ పార్టీలో చేరారు.  కేటీఆర్ సమక్షంలో  బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.  జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయన టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ ను వీడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంల పనిచేస్తానని  ఎర్ర శేఖర్ ప్రకటించారు. 

ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో  అనుబంధం ఉందని.. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల వలన గుణాత్మక మార్పు వచ్చిందని, మత్స్య సంపద విపరీతంగా పెరిగిందని ఎర్రశేఖర్ అన్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన తొలుత బీజేపీలో చేరారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. టికెట్ రాకపోవడంతో ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు.