ప్రతిపక్షాలకు ఓటేస్తే మురిగిపోతుంది : మంత్రి సీతక్క

ప్రతిపక్షాలకు ఓటేస్తే మురిగిపోతుంది : మంత్రి సీతక్క

యాదాద్రి, వెలుగు:  మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటేస్తే మురిగిపోతుందని పంచాయతీ రాజ్​ మంత్రి సీతక్క అన్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్​ గెలిచి అధికారంలోకి వస్తుందని తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణను పదేండ్లు పాలించిన కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం దోచుకుందని మంత్రి ఆరోపించారు.

దోచుకొని దాచుకున్న సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతోనే అన్న, చెల్లెల్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.  పదేండ్ల పాలనలో మున్సిపాలిటీల్లో మంచి నీళ్లు కూడా ఇవ్వలేక పోయారని ఆరోపించారు. ప్రచారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ఉన్నారు.