జాతర పనులు త్వరగా పూర్తి చేయండి : మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్

జాతర పనులు త్వరగా పూర్తి చేయండి : మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్
  •     మెదక్​ కలెక్టర్​ రాహుల్​రాజ్​

పాపన్నపేట/ నర్సాపూర్, వెలుగు: ఈనెల 13లోపు ఏడుపాయల జాతర పనులు పూర్తి చేయాలని మెదక్​ కలెక్టర్ రాహుల్ రాజ్​ ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా వాహనాల పార్కింగ్, తాగునీటి సౌకర్యార్థం ఇంట్రా గ్రిడ్ సంపు, భారీ కేడింగ్, తాత్కాలిక మరుగుదొడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

జాతర సమయం దగ్గర పడుతున్నందున పనుల్లో వేగం పెంచాలన్నారు. జాతర పరిసర ప్రాంతాలతో పాటు నదీపరీవాహక ప్రాంతానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ ఈఈ వేణు, ఇంట్రా గ్రిడ్ నాగభూషణం, మిషన్ భగీరథ ఈఈ సంపత్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ నరసింహ చారి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నర్సాపూర్​ ఎంపీడీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్​ సెంటర్​ను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించి, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్​ సెంటర్​ వివరాలను అడిగి తెలుసుకున్నారు.​పోస్టల్​ బ్యాలెట్ ప్రక్రియ ముగిసిన అనంతరం కౌంటింగ్​ హాల్​కు తరలించాలని ఆఫీసర్లను ఆదేశించారు.