మొదటిసారి జాతీయ జెండా ఆవిష్కరించిన హీరో నాని

మొదటిసారి జాతీయ జెండా ఆవిష్కరించిన హీరో నాని

హైదరాబాద్ : మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు హీరో నాని. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన స్వాతంత్ర 73వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నాని జాతీయ జెండాను ఆవిష్కరించాడు. ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అనిపించిందని చెప్పిన నాని..తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయన్నాడు. ఈ కార్యక్రమంలో 200 మంది చిన్నారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.