హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్సెట్–2026 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. ఇంజినీరింగ్, అగ్రి & ఫార్మసీ విభాగాల్లోనూ అత్యుత్తమ ర్యాంకులతో విద్యార్థులు ఆధిపత్యం కొనసాగించారు. స్టేట్ 2, 5, 6, 7, 8 వంటి అత్యుత్తమ ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ బి.అన్సుల్ కైవసం చేసుకోగా, ఆదుల సాయినిఖిత్ స్టేట్ 5వ ర్యాంకు, మల్లవరపు అస్నా 6వ ర్యాంకు, వివాన్ శరధ్ మహేశ్వరి 7వ ర్యాంకు, తాళ్లూరి శ్రేయాస్ రెడ్డి 8వ ర్యాంకు సాధించినట్లు నారాయణ గ్రూప్ డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మొత్తంగా 10లోపు 5, 100లోపు 51, 500లోపు 242, 1000లోపు 439 మంది నారాయణ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే సీటు సాధించే ర్యాంకుల సంఖ్య అత్యధికంగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని నారాయణ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప, డైరెక్టర్లు అభినందించారు.
