నర్సంపేట, వెలుగు : పేకాట ఆడుతూ నర్సంపేట మున్సిపల్వైస్ చైర్మన్, కౌన్సిలర్ తో పాటు మరో 8 మంది వరంగల్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు సోషల్‌మీడియాలో వైరల్చేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. నర్సంపేట సీఐ రమణమూర్తి తెలిపిన ప్రకారం.. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఆదివారం సాయంత్రం నర్సంపేట పరిధి సర్వాపురంలోని మున్సిపల్‌వైస్‌చైర్మన్, బీఆర్ఎస్ నేతమునిగాల వెంకట్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు.
పేకాట ఆడుతూ దొరికిన వారిలో వెంకట్‌రెడ్డితో పాటు కౌన్సిలర్శీలం రాంబాబు, మాజీ సర్పంచ్గోలి శ్రీనివాస్‌రెడ్డి, కోమాండ్ల గోపాల్, మాదిరెడ్డి సాగర్‌రెడ్డి, చిలువేరు శ్రీనివాస్, కోమాండ్ల కర్ణాకర్‌రెడ్డి, పేరాల సమ్మారావు, వేణుముద్దల దేవేందర్‌రెడ్డి, నంద్యాల సురేష్‌రెడ్డి ఉన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేయడంగా చర్చనీయాంశమైంది. నిందితుల వద్ద రూ. 33,360 నగదుతో పాటు 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ రవికుమార్, అరుణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.