మెడికల్ షాపులు బంద్.. ఎమర్జెన్సీ మందులు అందుబాటులో ఉంచాలి:మంత్రి దామోదర రాజనర్సింహ

మెడికల్ షాపులు బంద్.. ఎమర్జెన్సీ మందులు అందుబాటులో ఉంచాలి:మంత్రి దామోదర రాజనర్సింహ

నకిలీమందులు, బారీ డిస్కౌంట్లపై  ఆందోళన వ్యకంచేస్తూ బుధవారం (మే 20) దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పెట్టారు నిర్వాహకులు. ఆన్ లైన్ అమ్మకాలు, భారీ డిస్కౌంట్లు, నకిలీ మందులు నివారణపై బంద్ కు  AIOCD  ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ చేసి నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల్లో మెడికల్ షాపుల నిర్వాహకులు భారీ  ర్యాలీలు తీశారు. బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ అన్ని ఏర్పాటు చేసింది.  మందుల సరఫరాపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎమర్జెన్సీ సప్లయ్ కి టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు కార్పొరేట్ మెడికల్ స్టోర్లు తెరిచే ఉంటాయని డ్రగ్ కంట్రోల అథారిటీ (DCA)  తెలిపింది.