జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్.. నచ్చిన సెంటర్ ఎంచుకునేందుకు స్టూడెంట్లకు చాన్స్

జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్.. నచ్చిన సెంటర్ ఎంచుకునేందుకు స్టూడెంట్లకు చాన్స్
  • జూన్ 14 నుంచి హాల్ టికెట్లు జారీ
  • ఎగ్జామ్ టైం మరో 15 నిమిషాలు పెంపు
  • పాత ఫీజు రీఫండ్.. అదనపు రుసుము లేకుండానే పరీక్ష
  • విద్యార్థులకు మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్​టీఏ
  • మెరిట్ విద్యార్థుల భవిష్యత్తు  కోసమే నీట్ రద్దు: 
  • కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • వచ్చే ఏడాది నుంచి నీట్​ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మోడ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌ ఆరోపణలతో రద్దయిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ -యూజీ) 2026 ను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఖరారైంది. జూన్ 21వ తేదీ (ఆదివారం) నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు నేషనల్‌‌‌‌‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు మే 3న జరిగిన పరీక్షను పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ రద్దు చేసింది. గురువారం అర్ధరాత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం రీ-ఎగ్జామ్ తేదీపై నిర్ణయం తీసుకున్నారు.

  • రీ-ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ మార్గదర్శకాలివే..

నీట్ రీ-ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థుల సౌకర్యార్థం ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ కొన్ని కీలక మార్పులు, మార్గదర్శకాలను ప్రకటించింది.ఈ కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థులు తమకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్‌‌ను ఎంచుకోవడానికి ఒక వారం రోజుల పాటు ప్రత్యేక విండోను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌‌లను (హాల్ టికెట్లను) జూన్ 14 లోగా జారీ చేయనున్నారు. అంతేకాకుండా, ఈసారి పరీక్ష వ్యవధిని మరో 15 నిమిషాల పాటు పెంచారు.

 సవరించిన సమయం ప్రకారం.. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అలాగే, విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఎన్‌‌టీఏ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రద్దయిన మే 3 నాటి పరీక్ష కోసం అభ్యర్థులు చెల్లించిన ఎగ్జామ్ ఫీజును పూర్తిగా రీఫండ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పాత రిజిస్ట్రేషన్ ఆధారంగానే పరీక్షకు అనుమతిస్తామని తెలిపింది.

  • రీ-ఎగ్జామ్ ఫలితాల ప్రకటనపై సస్పెన్స్

రీ-ఎగ్జామ్ ఫలితాల ప్రకటన తేదీపై ఎన్‌‌టీఏ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై పూర్తి టైమ్‌‌లైన్‌‌తో కూడిన వివరణాత్మక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా రవాణా ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోనుంది. జూన్ నెలలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద తగిన అత్యవసర వసతులు కల్పించనున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని, పరీక్షకు సంబంధించిన అప్‌‌డేట్స్, సూచనల కోసం కేవలం ఎన్‌‌టీఏ అధికారిక ప్రకటనలను, వెబ్‌‌సైట్లను మాత్రమే సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థులు తమకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్‌‌ను ఎంచుకోవడానికి ఒక వారం రోజుల పాటు ప్రత్యేక విండోను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌‌లను (హాల్ టికెట్లను) జూన్ 14 లోగా జారీ చేయనున్నారు. అంతేకాకుండా, ఈసారి పరీక్ష వ్యవధిని మరో 15 నిమిషాల పాటు పెంచారు. సవరించిన సమయం ప్రకారం.. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అలాగే, విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఎన్‌‌టీఏ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రద్దయిన మే 3 నాటి పరీక్ష కోసం అభ్యర్థులు చెల్లించిన ఎగ్జామ్ ఫీజును పూర్తిగా రీఫండ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పాత రిజిస్ట్రేషన్ ఆధారంగానే పరీక్షకు అనుమతిస్తామని తెలిపింది.