వీడియోలను రీల్స్​గా షేర్​ చేసుకొనే ఫీచర్

వీడియోలను రీల్స్​గా షేర్​ చేసుకొనే ఫీచర్

వీడియోల్ని రీల్స్​గా ...

కంటెంట్ క్రియేటర్స్ రోజుకు వందల కొద్దీ వీడియోలు, రీల్స్ ఇన్​స్టాగ్రామ్​లో పెడుతుంటారు. వాటిలో పది సెకన్ల నుంచి 15 నిమిషాల వీడియోలు ఉంటాయి. వీడియోలను రీల్స్​గా షేర్​ చేసుకొనే ఫీచర్ తేబోతుంది ఇన్​స్టాగ్రామ్. ఈ కొత్త ఫీచర్​ ద్వారా పావుగంట కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలను రీల్స్​గా షేర్ చేయొచ్చు. దాంతో కంటెంట్ క్రియేటర్స్ పాపులర్​ వీడియోలని రీల్స్​గా షేర్ చేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోలని రీల్స్​గా షేర్​ చేసుకోవడం కుదరదు. అంతేకాదు త్వరలోనే ‘డ్యుయల్​’ ఫీచర్​ తేనుంది ఇన్​స్టాగ్రామ్. ఈ ఫీచర్​ వస్తే... ఒకేసారి ఫ్రంట్, బ్యాక్​ కెమెరాతో కంటెంట్, ఎక్స్​ప్రెషన్స్​ని రికార్డ్ చేయొచ్చు. 

ఫొటోల రీమిక్స్

ఇన్​స్టాగ్రామ్​లో ఫొటోలు, రీల్స్​ని రీమిక్స్​ చేసే ఫీచర్ రాబోతోంది. ఇప్పటివరకైతే కంటెంట్ క్రియేటర్స్  రీల్స్, వీడియోలనే రీమిక్స్ చేసే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఫొటోల్ని కూడా రీమిక్స్​ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్​ ఉంటే... ఫొటోల్ని రీమిక్స్ చేసేటప్పుడు కొత్త లే–అవుట్స్​ వాడొచ్చు. అంతేకాదు ఎవరి అకౌంట్​ నుంచైనా ఫొటోలు తీసుకుని రీమిక్స్ వీడియోలు చేయొచ్చు. ఫొటోలు పోస్ట్​ చేసేటప్పుడు రీమిక్స్​ ఫీచర్ డీఫాల్ట్​గా కనిపిస్తుంది కూడా. ఇంట్రెస్టింగ్ రీమిక్స్ వీడియోలు చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.