NIACLలో 550 అప్రెంటీస్ ఉద్యోగాలు: డిగ్రీ అర్హత ఉంటే చాలు.. కొద్దిరోజులే ఛాన్స్..

NIACLలో 550 అప్రెంటీస్ ఉద్యోగాలు: డిగ్రీ అర్హత ఉంటే చాలు.. కొద్దిరోజులే ఛాన్స్..

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) దేశవ్యాప్తంగా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: అప్రెంటీస్. 

మొత్తం ఖాళీలు: 550. తెలంగాణలో 18 (ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 9 ) ఖాళీలు ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 2022, జనవరి 1 కంటే ముందు గానీ లేదా 2026, జూన్ 1 తర్వాత గానీ ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు అర్హులు కారు.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 23. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.944. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మహిళా అభ్యర్థులకు రూ.708. ఎస్సీ, ఎస్టీ,  పీడబ్ల్యూబీడీలకు రూ.236. 

లాస్ట్ డేట్: జులై 6. 

ఆన్​లైన్ ఎగ్జామ్ డేట్: జులై 12. 

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రాత పరీక్ష, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.newindia.co.in ను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు 25  మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.