రేపు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

రేపు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలంగాణ శాసనమండలిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలి ఇన్‌ఛార్జి చైర్మన్ నేతి విద్యాసాగర్ కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజ్ హసన్, నర్సిరెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి ప్రమాణ స్వీకారం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.