హైదరాబాద్ లో నూతన సంవత్సర సంబరాలు

హైదరాబాద్ లో నూతన సంవత్సర సంబరాలు

గ్రేటర్ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫుల్ జోష్​తో జరిగాయి. ఒమిక్రాన్ భయం ఉన్నప్పటికీ కొత్త సంవత్సరానికి జనం ఉత్సాహంగా వెల్​కమ్​ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్యాంక్​బండ్, నెక్లెస్​ రోడ్డులో యూత్ ​కేకులు కట్​చేసి సందడి చేశారు. ‘లవ్ హైదరాబాద్’ వద్ద సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు. సాయంత్రం నుంచి సిటీలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. హోటల్స్, మాల్స్, బేకరీలు, స్వీట్ షాపులు, షాపింగ్​సెంటర్లు జనంతో కిక్కిరిశాయి. వైన్స్​లో ఫుల్​ రష్​ కనిపించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని స్టార్ హోటళ్లలో రాత్రి 9గంటల నుంచి ఈవెంట్స్ షురూ అయ్యాయి. మాల్స్​లో ఏర్పాటు చేసిన మ్యూజికల్​ ఈవెంట్స్ లో సింగర్స్​ తమ పాటలతో హోరెత్తించారు. కరోనా థర్డ్​వేవ్​ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో జనం ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవెంట్లకు వెళ్లలేని వాళ్లు ఇళ్లలోనే గెట్​టు గెదర్​లు ఏర్పాటు చేసుకున్నారు. అపార్ట్​మెంట్లు, కాలనీల అసోసియేషన్లే లోకల్​గా స్పెషల్​ప్రోగ్రామ్స్​ ఏర్పాటు చేశాయి. సిటీ శివారుల్లోని రిసార్టుల్లోని ఈవెంట్లు హుషారుగా జరిగాయి. డీజేల మ్యూజిక్ హోరులో యూత్ డ్యాన్సులతో న్యూ ఇయర్​కు కిక్​ ఇచ్చారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. – హైదరాబాద్, వెలుగు