బాధ్యతలు చేపట్టిన ఫెడరేషన్ చైర్మన్లు..సీఎంకు తిమ్మప్ప, చంద్రశేఖర్ కృతజ్ఞతలు

బాధ్యతలు చేపట్టిన ఫెడరేషన్ చైర్మన్లు..సీఎంకు తిమ్మప్ప, చంద్రశేఖర్ కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ బీసీ కార్పొరేషన్లకు కొత్తగా ఎన్నికైన చైర్మన్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వాల్మీకి బోయ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌గా గట్టు తిమ్మప్ప, టాడ్ టాపర్స్ (గీత కార్మికుల) కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌గా మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్ మసాబ్ ట్యాంక్‌‌‌‌లోని సంక్షేమ భవన్‌‌‌‌లో బాధ్యతలు చేపట్టారు.

తమకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఓబెదుల్లా కొత్వాల్, కార్పొరేషన్ ఎండీలు మల్లయ్య భట్టు, ఉదయ్ ప్రకాశ్ తదితరులు పాల్గొని బాధ్యతలు చేపట్టిన కొత్త చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు