హైదరాబాద్, వెలుగు: న్యూస్ పేపర్ల డిస్ర్టిబ్యూటర్స్కు గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేయాలని కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనను డిస్ర్టిబ్యూటర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వనమాల సత్యం, యామిని మధుసూదన్ కోరారు.
శనివారం సెక్రటేరియెట్లో హరిచందనను కలిసి వినతిపత్రం అందచేశారు. రాష్ట్రంలో న్యూస్ పేపర్ల పంపిణీ దారులైన ఏజెంట్లు వెండర్లు , పేపర్ బాయ్స్ అందరికీ గిగ్ వర్కర్స్కు అమలు చేసే సంక్షేమ స్కీమ్లను అమలు చేయాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని స్పెషల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రవి, లింగమూర్తి పాల్గొన్నారు.
