పెండింగ్ వేతనాలివ్వాలి..ఎన్‌హెచ్‌ఎం జేఏసీ డిమాండ్

పెండింగ్ వేతనాలివ్వాలి..ఎన్‌హెచ్‌ఎం జేఏసీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు:  నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు రావట్లేదని ఎన్‌హెచ్‌ఎం ఉగ్యోగుల జేఏసీ తెలిపింది. స్కూళ్లు ప్రారంభమయ్యే వేళ జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటి వరకు వేతనాలు అందలేదని పేర్కొంది.  డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది, కాంటింజెంట్ ఉద్యోగులు అనేక కేడర్లలో పనిచేస్తూ.. సేవలందిస్తున్న తమకు వెంటనే ప్రభుత్వం జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.