V6 News

పెద్ద ప్లేయర్లపై గెలుస్తూ, ప్రతీ టోర్నీలో నిరూపించుకోవాలి

పెద్ద ప్లేయర్లపై గెలుస్తూ, ప్రతీ టోర్నీలో నిరూపించుకోవాలి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌:  ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ గెలిచిన తొలి ఇండియన్‌‌‌‌గా చర్రిత సృష్టించిన తెలంగాణ స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌  పారిస్‌‌‌‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌‌‌‌పై ఇప్పటి నుంచే ఫోకస్‌‌‌‌ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతీ టోర్నమెంట్‌‌‌‌లోనూ సత్తా చాటి ఫామ్‌‌‌‌లో ఉండాలని చూస్తోంది. లెజెండరీ బాక్సర్‌‌‌‌ మేరీకోమ్‌‌‌‌తో సెలెక్షన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లో ఓడి టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ బెర్తు చేజార్చుకున్న నిఖత్‌‌‌‌ ఆమె నీడ నుంచి నెమ్మదిగా బయట పడుతోంది. ఈ క్రమంలో స్ట్రాంజా విక్టరీతో మంచి పేరు తెచ్చుకుంది. సెమీస్‌‌‌‌లో ఒలింపిక్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ బుసె నాజ్‌‌‌‌ను ఓడిస్తూ ఈ మెడల్‌‌‌‌ గెలిచిన నిఖత్‌‌‌‌ ఇకపై కూడా పెద్ద ప్లేయర్లపై గెలువాలని అంటోంది.  ‘ఇది వరకు బుసె నాజ్‌‌‌‌ చేతిలో నేను ఓడిపోయా. దాంతో, ఈ సారి వ్యూహాలను మార్చి ఆమె లీడ్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ను బ్లాక్‌‌‌‌ చేసే ప్రయత్నం చేశా. నాజ్‌‌‌‌పై  విక్టరీ నాకెంతో కాన్ఫిడెన్స్‌‌‌‌  ఇచ్చింది. ఇకపై కూడా నేను పెద్ద ప్లేయర్లపై గెలుస్తూనే ఉండాలి. ప్రతీ టోర్నమెంట్‌‌‌‌లో నా టాలెంట్‌‌‌‌ను ప్రూవ్‌‌‌‌ చేసుకోవాలి. లేదంటే నన్నెవ్వరూ గుర్తుంచుకోరు.  పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ వరకూ ఫామ్‌‌‌‌లో ఉండాలంటే గెలవడం ఒక్కటే దారి. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ విషయంలో విధి నా వైపు లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్నా. దాన్ని ఎప్పుడో మర్చిపోయా.  ఇప్పుడు నేను పాజిటివ్‌‌‌‌గా ఉన్నా. నా ఫోకస్‌‌‌‌ పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌పైనే ఉంది. ఈ ఏడాది వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌, కామన్వెల్త్‌‌‌‌, ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ లో పాల్గొనాలని అనుకుంటున్నా.  ఈ టోర్నీ (స్ట్రాంజా) తర్వాత ఇండియాలో సెలక్షన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లో పోటీ పడాలి. కాబట్టి  రిలాక్స్‌‌‌‌ అయ్యే టైమ్‌‌‌‌ లేదు. ఒక్కో అడుగు ముందుకేస్తా’ అని నిఖత్‌‌‌‌ చెప్పుకొచ్చింది.