RTA ఆఫీసుల్లోకి బ్రోకర్లకు నో ఎంట్రీ.. ఆర్టీఏ ఆఫీసు చుట్టుముట్టు బ్రోకర్లు కనిపిస్తే..

RTA ఆఫీసుల్లోకి బ్రోకర్లకు నో ఎంట్రీ.. ఆర్టీఏ ఆఫీసు చుట్టుముట్టు బ్రోకర్లు కనిపిస్తే..
  • ఆఫీసర్లు కుమ్మక్కైతే కఠిన చర్యలు
  • జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ ఆఫీసుల్లో బ్రోకర్లు, ఏజెంట్లకు నో ఎంట్రీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని విజిలెన్స్, ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ జాయింట్ ట్రాన్స్‌‌‌‌పోర్టు కమిషనర్ (జేటీసీ) చంద్రశేఖర్ గౌడ్ ఆదేశించారు. బుధవారం డీటీసీలు, డీటీవోలకు స్పష్టమైన సర్క్యులర్ జారీ చేశారు.

ప్రజా సేవల విశ్వసనీయతను దెబ్బతీస్తూ ఏజెంట్లతో కుమ్మక్కయ్యే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీఏ ఆఫీసుల పరిసరాల్లో తిరిగే బ్రోకర్లను గుర్తించి వెంటనే అక్కడి నుంచి పంపించి వేయాలని సూచించారు. 

హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోని కార్యాలయాల వద్ద బ్రోకర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని తెలిపారు. ఆదేశాలను బేఖాతరు చేసే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతిక కారణాలతో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని జేటీసీ ఆదేశించారు.