ఊళ్లలో అవిశ్వాస పంచాయతీ

ఊళ్లలో అవిశ్వాస పంచాయతీ
  • రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో నచ్చని ఉపసర్పంచులకు ఎసరు
  • జాయింట్ చెక్ పవర్ గొడవల కారణంగా చక్రం తిప్పుతున్న పాలకవర్గాలు
  • అధికార పార్టీలో కాక పుట్టిస్తున్న  అవిశ్వాస తీర్మానాలు
  • ఎమ్మెల్యేల జోక్యంతో గ్రామ పంచాయతీల్లో వర్గపోరు  

నల్గొండ, వెలుగు:  గ్రామపంచాయతీల్లో ఉప సర్పంచ్​ పదవులకు  ఎసరు పెట్టే కార్యక్రమం జోరందుకుంది. పంచాయతీ పాలకవర్గాలు ఎన్నికై ఈ ఏడాది ఫిబ్రవరికి రెండేళ్లు పూర్తయ్యాయి. దీంతో పరోక్షంగా ఎన్నికైనప్పటికీ కొత్త పంచాయతీరాజ్​ చట్టం ఇచ్చిన ‘జాయింట్​ చెక్​పవర్​’తో తమకు కొరకరాని కొయ్యలుగా మారిన ఉపసర్పంచులను అడ్డుతొలగించేందుకు అనేకచోట్ల సర్పంచులు, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు పావులు కదుపుతున్నారు. గతంలో సర్పంచ్​కు, పంచాయతీ సెక్రెటరీకి జాయింట్​ చెక్​పవర్​ ఉండేది.  కానీ కొత్త​ చట్టం ప్రకారం కేసీఆర్​ సర్కారు.. పంచాయతీ సెక్రెటరీకి బదులు ఉపసర్పంచ్​కు చెక్​పవర్​ కట్టబెట్టింది. దీంతో వందలాది గ్రామాల్లో ఫండ్స్​ ఖర్చు చేసే విషయంలో సర్పంచులకూ, ఉపసర్పంచులకూ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆయా చోట్ల  తాము సర్పంచులు, ఆఫీసర్ల అవినీతిని,  అక్రమాలను చెక్​పవర్​తో  అడ్డుకుంటున్నామని ఉపసర్పంచులు చెబితే, అన్ని వ్యవహారాల్లో తలదూర్చి గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచులు వాదిస్తూ వచ్చారు. వీరి గొడవల కారణంగా అనేక చోట్ల ఫండ్స్​ రిలీజ్​ కాక డెవలప్​మెంట్​ వర్క్స్​ ఆగిపోయాయి. కానీ రెండేళ్ల దాకా ఉపసర్పంచులను తొలగించే అవకాశం లేకపోవడం, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టే చాన్స్​ రావడంతో ఇదే అదునుగా తమకు సహకరించని ఉపసర్పంచులను వదిలించుకునేందుకు అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. 
పలుచోట్ల రంగంలోకి ఎమ్మెల్యేలు.. 
పంచాయతీల్లో తమ మాట వినని సర్పంచులు ఉన్నచోట ఏకంగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. ఆయా చోట్ల సర్పంచులకు, ఉపసర్పంచులకు నడుమ గొడవ ఉన్నా, లేకున్నా పాలకవర్గాన్ని పట్టుకొని కథ నడిపిస్తున్నారు. సర్పంచ్​తో సమానంగా ‘చెక్​పవర్​’ ఉన్న ఉప సర్పంచ్​పదవిలో తమకు అనుకూలమైన వార్డుసభ్యున్ని కూర్చో పెట్టేందుకు అవిశ్వాస తీర్మానాలు పెట్టిస్తున్నారు. ఇక రెండేళ్లుగా చెక్​పవర్ కోసమే ఎదురుచూస్తున్న కొంతమంది వార్డు సభ్యులు ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా ఒత్తిడి తెచ్చి ఉప సర్పంచుల పదవులు ఊడగొడుతున్నారు. ఇక ఎన్నికలప్పుడు పాలకవర్గాల మధ్య జరిగిన ఒప్పందాలు, ఇతర పార్టీల్లోంచి అధికార పార్టీల్లోకి మారినప్పుడు క్యాడర్​కు లీడర్లు ఇచ్చిన హామీలు.. ఇలా ఉప సర్పంచులపై అవిశ్వాస తీర్మానాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
వార్డు సభ్యులే ఇన్​చార్జిలు..
ఇప్పటికే స్టేట్​వైడ్​ వందలాది గ్రామాల్లో ఉపసర్పంచులపై అవిశ్వాస తీర్మానాలకు నోటీసులిచ్చారు. పలుచోట్ల సాధారణ మెజారిటీతో తీర్మానాలు నెగ్గించుకొని ఉపసర్పంచులను తొలగిస్తున్నారు. ఇలా అవిశ్వాస తీర్మానం ద్వారా ఉప సర్పంచులను పదవి నుంచి తొలగించాక ఆ స్థానంలో కొత్త వాళ్లను ఎన్నుకోవాలంటే ప్రత్యేకంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు పాలకవర్గంలోని మెజార్టీ వార్డుసభ్యుల తీర్మానం మేరకు ఎవరో ఒక వార్డు మెంబర్​కు జాయింట్ చెక్ పవర్ ఇస్తారు. కానీ ఎన్నిక జరిగే వరకు ఉప సర్పంచ్ పోస్టు ఖాళీగానే ఉంటుంది. గ్రామాల్లో ఇప్పటికే వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డు మెంబర్​, సర్పంచ్, ఉపసర్పంచ్​, ఎంపీటీసీ స్థానాలకు నెలలతరబడి ఎలక్షన్స్​ పెట్టడం లేదు.  వీటికి ఎన్నికలు నిర్వహించేందుకే పంచాయతీరాజ్ శాఖ, స్టేట్​ ఎలక్షన్​ కమిషన్​ కింద మీద పడుతున్నాయి. ఇందుకోసం శనివారం ఎలక్షన్ కమిషన్ ఓటరులిస్టుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా ఉప సర్పంచ్​లను తొలగించే కార్యక్రమం జరుగుతోంది. ఈ స్థానాలకు కూ డా నోటిఫికేషన్  ఇవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదనే చెప్తున్నారు.  ఎమ్మెల్యేల నడుమా చిచ్చు.. 
నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెల్మినేడు గ్రామ సర్పంచ్, వైస్ సర్పంచ్​కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ వివాదం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కు చుట్టుకున్నది.  వెల్మినేడు ఉప సర్పంచ్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో చేరారు. ఈయనకు ఎమ్మెల్యే లింగయ్య సపోర్ట్ ఉంది. ఉప సర్పంచ్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సర్పంచ్ ప్రయత్నించారు. దీనివెనక నల్గొండ ఎమ్మెల్యే, నకి రేకల్ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఉప స ర్పంచ్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేలోపే సర్పంచ్​ను పదవి నుంచి సస్పెండ్ చేశారు. దీని వెనక ఎమ్మెల్యే లింగయ్య హస్తం ఉందని సర్పంచ్ ఆరోపించారు. అయితే ఈ వ్యవహారం ఇంతదాకా రావొద్దన్న ఉద్దేశంతో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మధ్యవర్తిత్వం వహించారు. ఎమ్మెల్యేని సంప్రదించి పంచాయితీ లేకుండా సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో హరితహారం మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేశారన్న కా రణంతో సర్పంచ్​ను సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా ఇదే జిల్లా త్రిపురారం మండలం సత్యానారాయణ పురం పాలక వర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందింది. తర్వా త వైస్ సర్పంచ్ తప్ప మిగిలిన వాళ్లు టీఆర్ఎస్​లో చేరిపోయారు. అప్ప టి నుంచి వీళ్లమధ్య సఖ్యత లేకపోవడంతో పాలకవర్గం తీర్మానం చేసి వైస్ సర్పంచ్​ను తొలగించారు. కనగల్ మండలం చెట్లచెన్నారం  పాలకవర్గం అధికార పార్టీకి చెందినదే అయినప్పటికీ సర్పంచ్, వైస్​ సర్పంచ్లకు పడకపోవడంతో వైస్ సర్పంచ్ ను తొలగించారు.

సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు ఉప సర్పంచ్‌‌‌‌ లపై అవిశ్వా సాన్ని ప్రకటిస్తూ ఆర్డీవోలకు తీర్మానాలు అందజేశారు. వీరితో పాటు మరో  15 మంది ఉప సర్పంచ్‌‌‌‌ లపై అవిశ్వాస తీర్మానాలకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. మిరుదొడ్డి మండలం మోతే ఉప సర్పంచ్‌‌‌‌ ఒక పార్టీలో చేరకపోవడం వల్లే వార్డు సభ్యులంతా కక్షగట్టి ఆమెను తొలగిం చాలని చూస్తున్నారు. వర్గల్ మండలం మిరా జ్ పేట గ్రామ సర్పంచ్‌‌‌‌, ఉప సర్పంచ్ కొద్ది రోజుల క్రితం  రో డ్డుపై కొట్టుకుని పోలీస్‌‌‌‌స్టేష న్ వరకు వెళ్లారు. కొన్ని మండలాల్లో ఉప స ర్పంచ్‌‌‌‌ ఫోరంలు సైతం ఏర్పాటు చేశారు. ఇటీవల వర్గల్‌‌ ‌‌సర్పంచ్‌‌‌‌ల ఫోరం ఆధ్వర్యం లో గోవా విహార యాత్రకు వెళ్తే వారికి పోటీగా, అదే మండలం ఉప సర్పంచ్‌‌‌‌ల ఫోరం వైజాగ్ టూర్ వెళ్లినట్లు తెలిసింది. 
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కందిమల్ల వారి బంజర గ్రామాల్లో ఉప సర్పంచ్ మీద అవి శ్వాసం తీర్మానం పెట్టారు. కందిమల్ల వారి బంజారాలో చెక్ పవర్ తొలగించి మరో వార్డ్ సభ్యుడికి ఇచ్చారు. ఇక్కడ సర్పంచ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వర్గం కాగా, ఉప సర్పంచ్ మరో వర్గం కావడంతో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు టాక్ నడు స్తోంది. నేలకొండపల్లి లో ప్రాసెస్ పెండింగ్ లో ఉండగా.., సర్పంచ్, ఉప సర్పంచ్ కు పడకపోవడం వల్ల ఒకే పార్టీ అయినప్పటికీ  కొంతమంది వార్డు సభ్యులతో సర్పంచ్ అవిశ్వాసం పెట్టించడం గమనార్హం.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లో ఇద్దరు ఉప సర్పంచ్ ల పై అవిశ్వాస తీ ర్మానం ప్రవేశపెట్టారు. ఆదర్శ గ్రామం మల్కపూర్ లో అధికార పార్టీకి చెందిన  ఉప సర్పంచ్ పల్లెపాటి సుగుణ పై ఆరుగురు వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పదవుల నుంచి తొలగించారు. మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి ఉప సర్పంచ్​ను ఇలాగే తొలగించారు. కాల్లకాల్ ఉపసర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించడంతో అంతకుముందే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. 

  • సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామ ఉప సర్పంచ్ గోపాల్ పై 9 మంది వార్డు సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెట్టి నెగ్గించుఉన్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం ఉప సర్పంచ్ పై అవిశ్వాసం పెట్టగా, ఉప సర్పంచ్ పదవి నుంచి దిగిపోయాడు. ఇంకా వివిధ గ్రామాల్లో అవిశ్వాస తీర్మానాలకు రెడీ అవుతున్నారు. 
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​ మండలంలోని కొన్ని గ్రామాల్లో, గంగాధర మండలం గట్టుభూత్కూర్, చిన్న ఆచంపల్లి, మధురా నగర్ ఉపసర్పంచ్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈమేరకు అక్కడి పాలకవర్గాలు కలెక్టర్​ శశాంకకు అవిశ్వాసతీర్మానాల కోసం వినతిపత్రం ఇచ్చారు. 
  • పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలం జిల్లాలు ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించారు. పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్​ ఉపసర్పంచ్​లకు నోటీసులిచ్చారు. 
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందుర్తి, హనుమాజి పేటకు చెందిన గ్రామపంచాయతీల పాలకవర్గా లు ఆర్డీవో ను అవిశ్వాసతీర్మానాల కోసం సంప్ర దించారు. కొత్త చట్టం ప్రకారం అవిశ్వాసం ఎవరు చేపట్టాలి అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పంచాయతీ రాజ్ కమిషనర్ నుంచి వివరణ కోరినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.
  • యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం వెల్వర్తి ఉప సర్పంచ్, తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి ఉపసర్పంచ్​ను తొలగించేందుకు ఇప్పటికే అవిశ్వాస నోటీసు ఇచ్చారు.
  • ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామ ఉప సర్పంచ్ పై అవిశ్వాసం పెట్టారు. ఇక్క డి సర్పంచ్, ఉపసర్పంచ్​ల  మధ్య తగాదాల కా రణంగానే సర్పంచ్ వార్డు సభ్యులతో ఈ పని చేయించినట్లు తెలుస్తోంది.
  • నిర్మల్‍ జిల్లా కుంటాల మండలం కల్లూర్‍ గ్రామంలో ఉప సర్పంచ్‍ పై   అ విశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. 
  • వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లి ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అవుతున్నారు. సర్పంచ్ పై ఆరోపణలు చేస్తున్నాడన్న కారణంతో ఇటీవల ఇద్దరి మధ్య గొ డవ జరిగింది.  
  • జనగామ జిల్లా  రఘునాథ్ పల్లి ఉపసర్పంచ్ నీలం వాసు పై ఇటీవల అవిశ్వాసం పెట్టించి నెగ్గించుకున్నారు.  
  • మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టాలనుకుంటున్న చోట్ల సర్పంచ్ లకు, ఉపసర్పంచులకు మధ్య రూలింగ్​పార్టీ లీడర్లు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.