
హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తే తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అడ్వొకేట్ గీతాకుమారి దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్ తో కూడిన బెంచ్ పేర్కొంది. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫారం ఏ వంటివి పిటిషనర్ పూర్తి చేయనందున నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారని ఈసీ తరపు న్యాయవాది చెప్పారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. గీతాకుమారి పిటిషన్‌ను కొట్టివేసింది.