
- లీవ్ తీసుకుంటే లాస్ ఆఫ్ పే అయ్యేలా ఆర్డర్స్ ఇవ్వండి
- ఈసీకి ఎఫ్జీజీ లేఖ
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అన్నారు. అయితే, రూరల్ ఏరియాల్లోని ఏ ఎన్నికలో అయినా 90 శాతం పోలింగ్ నమోదవుతుందని, సిటీల్లో మాత్రం 50 శాతం పోలింగ్ దాటడం లేదన్నారు.
పోలింగ్ శాతం పెంపుపై అనేక సలహాలు, సూచనలతో గురువారం ఈసీకి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఈ నెల 13న పోలింగ్ సోమవారం ఉందని, అంతకు ముందు శని, ఆదివారాలు జంట నగరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు రెండు రోజులు సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. పోలింగ్ రోజున సెలవు ఉన్నందున ఉద్యోగులు టూర్లకు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు.
ఒక వేళ సోమవారం ఓటు హక్కు వినియోగించుకోకపోతే లాస్ ఆఫ్ పేగా పరిగణించి సాలరీ కట్ చేయాలని పద్మనాభరెడ్డి కోరారు. ఈ అంశంపై ఐటీ కంపెనీలకు ఈసీ ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. గత ఎన్నికల కంటే ఈ ఏడాది పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.